వరదలో కొట్టుకుపోయిన కారు !

Telugu Lo Computer
0


హర్యానా, పంచకులలోని ఖరక్ మంగోలి నది ఒడ్డున ఓ మహిళ తన కారును పార్క్ చేసింది. అయితే భారీ వర్షాల కారణంగా నదిలో వరద పోటెత్తడంతో కారు నదిలో కొట్టుకుపోయింది. ఇది గమనించిన స్థానికులు మహిళను రక్షించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. క్రేన్ సాయంతో వాహనాన్ని నదిలో నుంచి బయటకు తీసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. మరో వైపు.. ఢిల్లీ రైల్వేస్టేషన్‌ సమీపంలో ఓ యువతి రైలు ఎక్కేందుకు స్టేషన్‌కు చేరుకుంటోంది. మార్గమధ్యంలో నీటి గుంటలను దాటే క్రమంలో ఓ విద్యుత్‌ స్తంభాన్ని పట్టుకోవడంతో కరెంట్‌ షాక్‌కు గురైంది. ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)