దర్యాప్తు పూర్తయ్యే వరకు బహగానా స్టేషన్‌ వద్ద రైళ్లు ఆగవు !

Telugu Lo Computer
0


ఒడిశా బాలాసోర్‌లోని బహగానా స్టేషన్‌ వద్ద రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే బహగానా స్టేషన్ వద్ద ఇక రైళ్లు ఆగవు. ఈ కేసు సీబీఐ పరిధిలో ఉన్నందున దర్యాప్తు పూర్తి అయ్యే వరకు ఈ స్టేషన్ వద్ద రైళ్లు ఆగబోవని అధికారులు తెలిపారు. ఈ మేరకు సీబీఐ అధికారులు బహగానా స్టేషన్ లాగ్ బుక్స్‌ను స్వాధీనం చేసుకుని, స్టేషన్‌ను సీజ్ చేశారు. బహగానా స్టేషన్‌ను సీబీఐ సీజ్ చేసిందని దక్షిణ-తూర్పు రైల్వే చీఫ్ ఆదిత్య కుమార్ చౌదరి తెలిపారు. ఈ స్టేషన్‌ గుండా దాదాపు 170 రైళ్లు ప్రతిరోజూ ప్రయాణిస్తాయి. ప్యాసింజర్ రైళ్లు భద్రక్- బాలాసోర్, హౌరా-భద్రక్ బఘజతిన్, ఖరగ్‌పుర్ ఖుర్ధా రైళ్లు ఇక్కడ ఒక నిమిషం పాటు నిలిచేవని ఆయన తెలిపారు.


Post a Comment

0Comments

Post a Comment (0)