బోరుబావిలో పడిన 9 ఏళ్ల బాలుడిని సురక్షితంగా వెలికితీసిన అధికారులు

Telugu Lo Computer
0


రాజస్థాన్ జైపూర్ జిల్లాలోని భోజ్‌పురా గ్రామంలో శనివారం ఉదయం బోరుబావిలో పడిపోయిన తొమ్మిదేళ్ల బాలుడిని ఏడు గంటల పాటు శ్రమించి రక్షించారు. బాలుడు అక్షిత్ ఆడుకుంటూ తెరిచి ఉన్న బోరుబావిలో పడిపోయాడు. బోరుబావిపై ఉన్న రాయిని ఇతర పిల్లలు తొలగించడంతో అది చూడకుండా అక్షిత్ అందులో పడిపోయాడు. బాలుడు 200 ఫీట్ల బోరుబావిలో చిక్కుకున్నాడు. దాదాపుగా 7 గంటలు కష్టపడిన తర్వాత బాలుడ్ని విజయవంతంగా రెస్క్యూ చేశారు. బాలుడి పరిస్థితి నిలకడ ఉన్నట్లు, ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. అక్షిత్ బోరుబావిలో పడిన ఘటన అధికారులకు చేరడంతోనే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్), ఎస్డీఆర్ఎఫ్, రాజస్థాన్ పోలీస్ బృందాలు రెస్యూ ఆపరేషన్ ప్రారంభించాయి. రెస్క్యూ సమయంలో బోరులోకి పిల్లాడికి ఆక్సిజన్, నీరు, తినడానికి బిస్కెట్ల సరఫరా చేసినట్లు అధికారులు తెలిపారు. ఇనుప వలను బోరు బావిలోకి పంపిన అధికారులు, దానికి అక్షిత్ చిక్కుకునేలా చేసి పైకి తీసుకురాగలిగారు. రాష్ట్రవ్యవసాయం మంత్రి లాల్ చంద్ కటారియా సంఘటన స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ను దగ్గరుండి పర్యవేక్షించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)