రూల్ ఈజ్ రూల్..రూల్ ఫర్ ఆల్ !

Telugu Lo Computer
0


రూల్ ఈజ్ రూల్..రూల్ ఫర్ ఆల్ అనే విధంగా ఓ మహిళా కానిస్టేబుల్ తన విధులను నిర్వర్తించారు. ఏకంగా తమ బాస్‌నే అడ్డుకున్నారు. ఫోన్ లోపలికి అనుమతి లేదని బయట ఇచ్చిపోవాలని సూచించారు. ఫలితంగా సీపీ తన ఫోన్ ‎ను ఆమెకు అప్పగించారు. ఎల్బీ నగర్‌లోని పదోతరగతి పరీక్షకేంద్రం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. మహిళా కానిస్టేబుల్ ధైర్యానికి అక్కడున్నవారంతా షాక్‎కు గురయ్యారు. పదోతరగతి పరీక్ష పేపర్లు లీక్ కావడంతో మిగతా పరీక్షలన్నీ కట్టుదిట్టంగా జరిపేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఫోన్లను పరీక్షాకేంద్రాల్లోని తీసుకువెళ్లేందుకు అనుమతి లేదని చెప్పిన మంత్రి. అధికారులు కూడా ఈ నిబంధన తప్పనిసరిగా పాటించాలని సూచించారు. దీంతో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి ఫోన్లను గేటు బయటే తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే గురువారం రాచకొండ సీపీ చౌహాన్ ఎల్బీ నగర్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేయడానికి వెళ్లారు. సీపీ ఫోన్‌తో లోపలికి వెళ్తుండగా ఓ లేడీ కానిస్టేబుల్ అడ్డుకున్నారు. ఫోన్ ఇచ్చేసి లోపలికి వెళ్లాలని కోరారు. దీంతో సీపీ ఫోన్ ఆమెకి అందించి పరీక్షకేంద్రాన్ని తనిఖీ చేశారు. అనంతరం బయటకు వచ్చి లేడీ కానిస్టేబుల్‎ను అభినందిచారు. రూల్స్‌ను కట్టుదిట్టంగా అమలు చేసినందుకు ఆమెకు రివార్డును కూడా అందించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)