మండే మోటివేషన్ - ఆకట్టుకున్న పెంగ్విన్ల మార్చ్‌

Telugu Lo Computer
0

సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ తరచూ ఆలోచన రేకెత్తించే పోస్ట్‌లు షేర్ చేసే కార్పొరేట్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా లేటెస్ట్‌గా మండే మోటివేషన్ పోస్ట్‌తో ముందుకొచ్చారు. ఈసారి పెంగ్విన్ల గ్రూప్ మార్చ్ చేస్తున్న అద్భుతమైన వీడియోను ఆయన పోస్ట్ చేశారు. ఇన్‌స్పిరేషనల్ క్యాప్షన్ జోడించారు. విజయాన్ని చేరుకునే దారి సంక్లిష్టమైనదని, దీనికోసం కష్టపడి పనిచేయాల్సి ఉందని ఆనంద్ మహీంద్రా రాసుకొచ్చారు. గుంపులో ఒకరిగా ఉండటం కాదని, విజయాన్ని దక్కించుకుని, అనుకున్నది సాధించేందుకు భిన్నంగా ఆలోచించాలని చెప్పుకొచ్చారు. మండే మోటివేషన్ పోస్ట్ ద్వారా మహీంద్రా గ్రూప్ చీఫ్ ఈ సంకేతాలను పంపారు. ఆయన షేర్ చేసిన వీడియోలో పెంగ్విన్ల గ్రూప్ ఒకే వరుసలో నడుస్తూ ముందుకెళ్లడం కనిపిస్తుంది. ఈ పెంగ్విన్‌లు ఒకే దారిలో ఒక దాని వెంట ఒకటి నడుస్తున్నాయి. అయితే వీటిలో ఓ పెంగ్విన్‌ను గమనించారా..? అది తన పొట్టతో పాటు దొర్లుతూ ముందుకు సాగుతుంది. మీరూ నలుగురి దృష్టిలో పడాలంటే భిన్నంగా ఆలోచించండి. మండే మోటివేషన్ అని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు గుప్పించారు. భిన్నంగా ఆలోచిస్తేనే విజయాలు సొంతమవుతాయని కామెంట్స్ సెక్షన్‌లో పలువురు రాసుకొచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)