చపాతీని అధిక ఉష్ణోగ్రతల వద్ద కాల్చితే క్యాన్సర్ ?

Telugu Lo Computer
0


చపాతీలను తవాపై వండిన తర్వాత గ్యాస్‌ మంటపై కాల్చడం చేస్తుంటారు. ఇలా అధిక ఉష్ణోగ్రత వద్ద చపాతీ తయ్యారు చేయడం వల్ల అనేక వ్యాధులు వస్తాయి. తాజాగా చపాతీ తయారీకి సంబంధించిన ఓ పరిశోధన తెరపైకి వచ్చింది. ఈ రీసెర్చ్ ప్రకారం చపాతీని ఇలా తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. న్యూట్రిషన్ అండ్ క్యాన్సర్ జర్నల్‌లో ప్రచురించబడిన మరో పరిశోధన ప్రకారం, చపాతీలను అధిక ఉష్ణోగ్రతల వద్ద ఉడికించినట్లయితే, అవి క్యాన్సర్ కారకాలను ఉత్పత్తి చేస్తాయి. దీంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఆస్తమా రోగులు దీని వల్ల ఎక్కువ బాధపడతారు, అయితే సాధారణ జనాభాలో శ్వాసకోశ రుగ్మతలు వచ్చే ప్రమాదం ఉంది. జర్నల్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రచురించబడిన ఒక అధ్యయన నివేదిక ప్రకారం, కుక్‌టాప్‌లు మరియు ఎల్పీజీ  గ్యాస్ నైట్రోజన్ డయాక్సైడ్ మరియు కార్బన్ మోనాక్సైడ్ వంటి అనేక ప్రమాదకరమైన వాయువులను విడుదల చేస్తాయి. ఈ వాయువులు ఆరోగ్యానికి ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఇది శ్వాసకోశ సమస్యలు, క్యాన్సర్ మరియు హృదయ సంబంధ రుగ్మతలకు కారణమవుతుందని చెప్పారు. ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్త డాక్టర్ పాల్ బ్రెంట్ ప్రకారం, 'గ్యాస్‌పై చపాతీ వండటం వల్ల అక్రిలమైడ్ అనే రసాయనం ఉత్పత్తి అవుతుంది. అలాగే చపాతీని నేరుగా గ్యాస్‌పై వండటం వల్ల క్యాన్సర్ కారకాలు ఉత్పత్తి అవుతాయి. ఇది ఆరోగ్యానికి ప్రమాదకరం.' ఈ పరిశోధన ఫలితాలు నిజమని హామీ ఇవ్వలేము. అయితే రీసెర్చ్‌లో వస్తున్న విషయాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయని అంటున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)