కాంగ్రెస్ స్టార్ కాంపైనర్ల ప్రకటన

Telugu Lo Computer
0


కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సంబంధించి స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ బుధవారం విడుదల చేసింది. మొత్తం 40 మంది అభ్యర్థులతో విడుదల చేసిన ఈ జాబితాలో తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్‭లకు అవకాశం కల్పించారు. కాగా, తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఇద్దిరికి మాత్రమే చోటు దక్కడం గమనార్హం. ఇక సీనియర్లెవరికీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చోటు లభించలేదు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేసిన శశి థరూర్, కొద్ది రోజుల క్రితమే బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన కర్ణాటక మాజీ సీఎం జగదీష్ షెట్టర్ వంటి నేతలకు ఇందులో చోటు లభించింది. ఈ జాబితాలో మల్లికార్జు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, డీకే శివకుమార్, సిద్ధరామయ్య, కేసీ వేణుగోపాల్, రణ్ దీప్ సింగ్ సూర్జేవాలా, బీకే హరిప్రసాద్, ఎంబీ పాటిల్,  డాక్టర్ జీ పరమేశ్వర, కేహెచ్ మునియప్ప, జైరాం రమేశ్, డాక్టర్ ఎం వీరప్ప మొయిలీ, రామలింగా రెడ్డి, సతీశ్ జర్కిహోలి, జగదీశ్ షెట్టర్, డీకే సురేశ్, జీసీ చంద్రశేఖర్, సయ్యద్ నసీర్ హుస్సేన్, జమీర్ అహ్మద్ ఖాన్, హెచ్ఎం రేవన్న, ఉమశ్రీ, అశోక్ గెహ్లోట్, భూపేష్ బాఘేల్, సుఖ్వీందర్ సింగ్ సుక్కు, పి.చిదంబరం, పృథ్విరాజ్ చౌహాన్, అశోక్ చవాన్, శశి థరూర్, రేవంత్ రెడ్డి, రమేశ్ చెన్నితల, బివి శ్రీనివాస్, రాజ్ బబ్బర్, మహ్మద్ అజారుద్దీన్, దివ్య స్పందన, ఇమ్రాన్ ప్రతాపగడి, కన్హయ్య కుమార్, రూప శశిధర్, సాధుకోకిల ఉన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)