క్రెడిట్ అంతా కేసీ ఆర్ దే !

Telugu Lo Computer
0


నిన్నటి వరకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో వెనక్కు తగ్గేదే లేదు.. రేపో మాపో ప్రైవేటుపరం అవ్వడం ఖాయమంటూ కేంద్రం ప్రకటనలు చేస్తూ వచ్చింది. లోక్ సభ, రాజ్యసభ లోనూ ఇవే ప్రకటనలు చేసింది. కానీ స్టీల్ ప్లాంట్ పర్యటనకు వచ్చిన కేంద్ర సహాయ మంత్రి ఫగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ముందుకు వెళ్లడం లేదన్నారు. అయితే పూర్తిగా ఈ ఆలోచన విరమించుకున్నట్టు ప్రకటించనప్పుటికీ ఇది తాత్కాలిక ఊరటే అని చెప్పాలి. ఆయన ప్రకటన చేయడమే ఆలస్యం  అన్ని రాజకీయ పార్టీలు.. ఈ క్రెడిట్ తమది అంటే తమది అంటూ రాజకీయం మొదలెట్టాయి. రాజకీయ పార్టీలు క్రెడిట్ కోసం కొట్లాడుకుంటుంటే.. దీనిపై  సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందించారు.  క్రెడిట్ అంతా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇచ్చారు ఆయన. ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్ ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. ఇంతకీ ఆయన ఏం ట్వీట్ చేశారంటే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు. ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్‌లో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ పరిశీలినకు బృందాన్ని పంపి సరైన చర్యలు తీసుకున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. ప్రైవేటీకరణకు వెళ్లడానికి బదులుగా, ఆర్ఐఎన్ఎల్‌ని బలోపేతం చేసే దిశగా అడుగులు వేసేందుకు దోహదపడింది. తెలంగాణ ప్రభుత్వం బిడ్‌లో పాల్గొనడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అయితే ఈ ట్వీట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఆయన్ను బీఆర్ఎస్ పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించిన నేపథ్యంలో ఆయన కేసీఆర్‌కు క్రెడిట్ ఇస్తూ ట్వీట్ చేశారని అంటున్నారు. అయితే ఆయన సైతం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ముందు నుంచి పోరాడుతూనే ఉన్నారు. కార్మికులకు టచ్ లో ఉంటూ సలహాలు ఇస్తున్నారు. ఉద్యమంలో నేరుగా పాల్గొంటున్నారు. అక్కడితోనే ఆగకుండా న్యాయ పోరటం కూడా చేస్తున్నారు.. అయినా ఆయన క్రెడిట్ తీసుకోకుండా, కేసీఆర్ కు ఇవ్వడం చర్చనీయాంశం అవుతోంది. ఈ క్రెడిట్ కోసం రాజకీయాలు పోటీ పడుతున్నా అసలు విజయం కార్మిక సంఘాలదే అని ప్రజా సంఘాలు అంటున్నాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)