ఆవు మూత్రం ప్రమాదకరం !

Telugu Lo Computer
0


ఆవు మూత్రాన్ని సర్వరోగా నివారిణిగా చెప్తుంటారు మన పెద్దలు. కానీ ఆవు మూత్రం ఎంతో ప్రమాదకరమని జంతు పరిశోధనా సంస్థ అయిన బరేలీకి చెందిన ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. ముగ్గురు పీహెచ్‌డీ విద్యార్థులతో పాటు ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన భోజ్ రాజ్ సింగ్ నేతృత్వంలోని అధ్యయనంలో ఆరోగ్యవంతమైన ఆవులు, ఎద్దుల మూత్రం నమూనాలలో కనీసం 14 రకాల హానికరమైన బ్యాక్టీరియాలు ఉన్నాయని కనుగొన్నారు. దీంతో గోమూత్రం మనుషులకు పనికిరాదని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. ఇది కడుపు ఇన్‌ఫెక్షన్లకు కారణమవుతుందని, కాబట్టి ప్రజలు గోమూత్రం తాగడం మానుకోవాలని నివేదిక పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)