అమరావతి స్ధలాలపై సుప్రీంకోర్టులో కేసు ఉపసంహరణ

Telugu Lo Computer
0


పేదలకు ప్రభుత్వం ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని అనుకుంటే మధ్యలో మీకు వచ్చిన కష్టము, నష్టము ఏమిటంటూ పిటీషనర్ ను సుప్రీంకోర్టు నిలదీసింది. మీ దగ్గరున్న స్ధలాన్ని తీసుకుని ప్రభుత్వం పేదలకు పంచుతున్నదా అని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు వేసిన ఏ ప్రశ్నకు పిటీషనర్ సమాధానం చెప్పలేకపోయాడు. దాంతో కేసు విచారణార్హం కాదని న్యాయస్ధానం భావించింది. దాంతో కేసు కొట్టేయాలా ? లేకపోతే మీరే ఉపసంహరించుకుంటారా ? అని పిటీషనర్ను అడిగింది. సుప్రీం దెబ్బకు వేరే గత్యంతరం లేక పిటీషనరే కేసును ఉపసంహరించుకున్నాడు. ఇంతకీ విషయం ఏమిటంటే అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ళపట్టాలు పంపిణీ చేయాలన్నది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయం. అయితే రాజధాని నిర్మాణానికి అంటే తాము భూములిచ్చాము కాబట్టి తమ భూముల్లో పేదలకు ఇళ్ళపట్టాలు ఇవ్వకూడదని అమరావతి రైతుల ముసుగులో కొందరు రియాల్టర్లు హైకోర్టులో కేసు వేశారు. కేసు విచారణ సందర్భంగా హైకోర్టు అడిగిన ప్రశ్నలకు పిటీషనర్ ఏమీ సమధానం చెప్పలేకపోయాడు. దాంతో కేసు కొట్టేస్తూ అవసరమని అనుకుంటే సుప్రీంకోర్టు వెళ్లొచ్చు అన్నది. పిటీషనర్ ముందు వెనకా ఆలోచించకుండా సుప్రీంకోర్టులో కేసు వేస్తే  పేదలకు ఇళ్ళపట్టాలు ఇస్తే మీకొచ్చే నష్టమేమిటో చెప్పమంటే పిటీషనర్ చెప్పలేకపోయాడు. తమ దగ్గర పేదలకు పట్టాలిస్తే భౌగోళిక సమతుల్యం (డెమొక్రటిక్ ఇంబ్యాలెన్స్) దెబ్బతింటుని మాత్రమే పిటీషనర్ వాదిస్తున్నారు. ఈ వాదనను సుప్రీంకోర్టు కొట్టేసింది. సుప్రీంకోర్టులో డెవలప్మెంట్ల ప్రకారం అమరావతి ప్రాంతంలో 75 వేలమంది పేదలకు ఇళ్ళపట్టాలు ఇవ్వటానికి మార్గం సుగమమైనట్లే. కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని పేదల్లో కొందరికి అమరావతి ప్రాంతంలో  ప్రభుత్వం పట్టాలు ఇవ్వబోతోంది. ఇందుకోసం 1175 ఎకరాలను రెడీచేయమని ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. దీనికి సంబంధించిన పనులు చురుగ్గా సాగుతున్నాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)