గుజరాత్ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల దగ్గర 22 వేల కోట్లు ?

Telugu Lo Computer
0


గుజరాత్‌లో పనిచేస్తున్న పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌లు షేర్ మార్కెట్లో వేల కోట్లు పెట్టుబడి పెట్టినట్లు ఓ సంచలన కథనం వెలువడింది. ప్రముఖ గుజరాతీ పత్రిక 'దివ్య భాస్కర్' ప్రచురించిన ఈ కథనంపై దేశవ్యాప్తంగా కలకలం రేగుతోంది. సూటుగీటు బాసులు ఇంత సొమ్మును ఎలా సంపాదించారని కొమ్ములు తిరిగిన రాజకీయ నాయకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. దివ్య భాస్కర్ కథనం ప్రకారం గుజరాత్ లోని పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ రంగాల్లో రూ. 22,500 కోట్ల పెట్టుబడులు పెట్టారు. గుజరాత్‌లోని స్టాక్ మార్కెట్ బ్రోకర్ల నుంచి సేకరించిన సమాచారంలో ఈ వివరాలు ఉన్నాయి. రాష్ట్రంలోని 90 శాతం మంది ఐఏఎస్, ఐపీఎస్‌లు దగ్గరి బంధువుల, స్నేహితుల పేర్ల మీద డీమ్యాట్ ఖాతాలు తెరిచి లావాదేవీలు సాగించారు. ఇంత భారీ మొత్తంలో డబ్బు సంపాదించడం జీతభత్యాల ద్వారా సాధ్యమయ్యేది కాదు. అవినీతి, ఇతరేతర అక్రమాలతో ఈ డబ్బు సంపాదించి ఉండొచ్చు. 87 మంది అధికారులు 22,500 కోట్లలో 7500 కోట్లను షేర్ మార్కెట్లో, మిగతా 15 వేల కోట్లను వివిధ రాష్ట్రాల్లోని రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో పెట్టారు. ఇదొక వింత అయితే 65 మంది అధికారుల వద్ద నయాపైసా ఆస్తులే లేవన్న విడ్డూరం కూడా వెలుగు చూసింది. ఐపీఎస్, ఐఏఎస్ అధికారులే కాకుండా పలువు మంత్రులు, చోటామోటా నేతలు కూడా వేల కోట్ల రూపాయను వెనకేసుకున్నట్లు దివ్యభాస్కర్ పత్రి వెల్లడించింది. పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు 'సంపాదించిన సొమ్ము'ను ఇతర దేశాలకు కూడా తరలించినట్లు దివ్య భాస్కర్ తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)