దొంగే, దొంగ దొంగ అన్నట్లుంది !

Telugu Lo Computer
0


ప్రధాని మోడీ ఫై సిపిఐ రామకృష్ణ ఘాటు విమర్శలు చేసారు. మోడీ తీరు చూస్తుంటే..దొంగే.. దొంగ దొంగ అని అరిచినట్లుందని ఆంధ్రప్రదేశ్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 28 మంది వేల కోట్లు ఎగ్గొట్టి కొందరు విదేశాలకు పారిపోయారన్నారు. బ్యాంకుల్లో వేల కోట్లు కొల్లగొట్టిన వారిలో విజయ్ మాల్యా తప్ప అందరూ గుజరాత్ కు చెందిన వారేనని అన్నారు. మోడీ ప్రధాని కావటానికి అదానీ దేశమంతా తిరిగారని, మోడీ ప్రధాని అయిన తర్వాత అదానీని ప్రపంచ కుబేరులలో రెండవ స్ధానానికి తీసుకు వెళ్లారని ఆరోపించారు. రాహుల్ గాంధీ నాలుగేళ్ల క్రితం మాట్లాడితే ఇవాళ శిక్షలు వేశారని, రాహుల్ గాంధీ క్వార్డర్స్ కూడా ఖాళీ చేయమన్నారని మండిపడ్డారు.

Post a Comment

0Comments

Post a Comment (0)