ఇంగ్లీష్ రాని నాతో సంతకం చేయించుకుని కంపెనీ మోసం చేసింది !

Telugu Lo Computer
0


సైకిల్ మీద తిరుగుతూ కచ్చా బాదం పాట పాడుతున్న వీడియో నేటికీ వైరల్ అవుతూనే ఉంది. ఆ సాంగ్ ను మళ్లీ మళ్ళీ వింటూ ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. అయితే తాను మోసపోయానని, ఇప్పుడు తన సాంగ్ ను తాను సొంతంగా పాడలేక పోతున్నా అంటూ భుబన్ బద్యాకర్ వాపోతున్నాడు. కాపీరైట్ విషయంలో తాను మోసపోయానని సింగర్ చెబుతున్నాడు. యూట్యూబ్‌లో తన పాటను షేర్ చేసినందుకు ఒక కంపెనీ రూ.3 లక్షలు ఇచ్చారు. అయితే ఇందుకోసం సదరు కంపెనీ తనను కొన్ని పేపర్స్ మీద సంతకం పెట్టమని చెప్పారు. ఆ పేపర్ చాలా గజిబిజిగా ఉంది. ఇలా సంతకం పెడితే తాను భవిష్యత్ లో ఇబ్బందులు వస్తాయని తనకు తెలియదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తాను చదువుకోలేదు, ఇంగ్లీష్ చదవడం కూడా తెలియదని చెప్పాడు. అయితే ఆ సంస్థ నా పాట కొనుక్కున్నట్లు చెబుతోంది. మాట్లాడడం కూడా మానేసింది. తాను కాపీరైట్ సమస్య కారణంగా.. తన పాటలను తాను పాడలేను,  ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయలేను.

Post a Comment

0Comments

Post a Comment (0)