అమిత్ షా వెళ్లే విమానంలో సాంకేతిక సమస్య !

Telugu Lo Computer
0


కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. మరో ఫ్లైట్‌ ఏర్పాటు చేసుకున్న తర్వాత కొచ్చికి బయలుదేరుతారు. అప్పటి వరకు ఆయన రాత్రి బస చేసిన నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ (ఎన్ఐఎస్ఏ)లోనే ఉంటారు. ఆయన వెంట బండి సంజయ్, కిషన్ రెడ్డి, మరికొందరు బీజేపీ నేతలు ఉన్నారు. సీఐఎస్ఎఫ్ రైజింగ్ డేలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన సీఐఎస్‌ఎఫ్‌ రైజింగ్‌ డే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈరోజు ఉదయం 11:40 గంటలకు కొచ్చి షా కొచ్చికి బయలుదేరాల్సి ఉంది. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ బీజేపీ నేతలు కేంద్ర మంత్రి అమిత్ షాను కలిశారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంపై పార్టీ నేతలు అమిత్ షాతో చర్చించారు. బీఆర్ఎస్ వ్యూహను ఎదుర్కొనేందుకు అవలంభించాల్సిన వ్యూహంపై బీజేపీ నేతలకు అమిత్ షా దిశా నిర్ధేశం చేశారని సమాచారం. అంతకు ముందు సీఐఎస్ఎఫ్ 54వ రైజింగ్ డేలో పాల్గొన్న అమిత్ షా, సీఐఎస్ఎఫ్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ 53 ఏళ్లుగా దేశ సేవలో సీఐఎస్‌ఎఫ్‌ కీలకపాత్ర పోషిస్తోందన్నారు. సీఐఎస్‌ఎఫ్ డ్రోన్ టెక్నాలజీని మరింత బలోపేతం చేయనున్నారు. దేశ సేవలో ప్రాణాలర్పించిన సీఐఎస్ఎఫ్ జవాన్లకు అమిత్ షా నివాళులర్పించారు.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)