కన్ను కొట్టిందని కార్ ఎక్కించుకున్నాడు....!

Telugu Lo Computer
0


హర్యానాలోని గురుగ్రామ్ జిల్లాలో  నళిన్ అనే వ్యక్తి ఒక ప్రైవేట్ కంపెనీలో డిప్యూటీ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. శనివారం విధులు ముగించుకుని తిరిగి ఇంటికి బయలు దేరాడు. రోడ్డు పై ఓ మహిళ లిఫ్ట్ అడగడంతో ఆమె కాల్ గర్ల్ అని తెలియక ఎక్కించుకున్నాడు. ఆమెను హుడా సిటీ మెట్రో స్టేషన్‌లో దించాడు. ఈ మధ్యలోనే ఆమె అతడినుంచి రూ. 1.25 లక్షల విలువైన బంగారు బ్రాస్‌లెట్‌ను దోచుకుంది. జరిగిన ఘటనపై నళిన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గురుగ్రామ్‌ పోలీసులు దొంగతనం సెక్షన్ 424కింద మహిళపై ఎఫ్ఐఆర్  నమోదు చేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. నిందితురాలిని త్వరలో పట్టుకుంటామని సెక్టార్ 40 పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ సతీష్ కుమార్ తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)