బ్రెడ్ ప్యాకెట్‌లో బతికున్న ఎలుక ?

Telugu Lo Computer
0


ఆన్ లైన్ లో గ్రోసరీ ఆర్డర్ చేసిన నితిన్ అరోరా అనే కస్టమర్ కు చేదు అనుభవం ఎదురైంది. అతడి ఇంటికి వచ్చిన బ్రెడ్ ప్యాకెట్‌లో బతికున్న ఎలుక కనిపించింది. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నాడు. గ్రోసరీ సేవలు అందించే బ్లింకిట్‌లో పలు వస్తువులను ఆర్డర్ చేశాడు. అందులో బ్రెడ్ ప్యాకెట్ కూడా ఒకటి. బ్లింకిట్ ఎగ్జిక్యూటివ్ వచ్చి వస్తువులను డెలివరీ చేసి వెళ్లిపోయాడు. నితిన్ అరోరా వాటిని తెరిచి చూడగా కళ్లు బైర్లు కమ్మాయి. బ్రెడ్ ప్యాకెట్ లో బతికున్న ఎలుక కనిపించింది. బ్రెడ్ ప్యాకెట్ లోకి దూరిన ఎలుక అక్కడి నుంచి బయటకు రాలేక అలాగే ఉండిపోయింది. దీని గురించి నితిన్ అరోరా సోషల్ మీడియాలో తెలియజేశాడు. తనకు ఎంతో అసౌకర్యమైన అనుభవం ఎదురైనట్టు ట్విట్టర్ లో వాపోయాడు. ఇది మనకు హెచ్చరిక వంటిదని రాసుకొచ్చాడు. 10 నిమిషాల డెలివరీలో అలాంటివి ఉండేటట్టు అయితే, సరైన డెలివరీ కోసం నేను గంటల కొద్దీ వేచి చూడడానికి వెనుకాడను అంటూ నితిన్ ట్వీట్ చేశారు. దీనికి బ్లింకిట్ టీమ్ వెంటనే స్పందించింది. మీకు ఇలాంటి అసౌకర్యం కలగాలని మేము కోరుకోలేదు, మీ కాంటాక్ట్ నెంబర్ లేదా ఆర్డర్ ఐడీ పంపితే సమస్యను పరిష్కరిస్తామని బదులిచ్చింది. అంతేకాదు కఠిన చర్య తీసుకున్నామని, పార్ట్ నర్ ను తమ ప్లాట్ ఫామ్ నుంచి తొలగించామని బ్లింకిట్ కస్టమర్ సపోర్ట్ హెడ్ వెల్లడించాడు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లను షాక్ కి గురి చేస్తోంది. బ్రెడ్ ప్యాకెట్ లో ఎలుక.. చాలా దారుణం అంటున్నారు. సదరు గ్రోసరీ సంస్థ సిబ్బంది నిర్లక్ష్యంపై ఫైర్ అవుతున్నారు. ఇది క్షమించరాని నేరం అంటున్నారు. ఆలస్యం అయినా ఫర్వాలేదు కానీ, సురక్షితమైన ఫుడ్ డెలివరీ చేయాలంటూ గ్రోసరీ సంస్థలకు సూచిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)