ఆధిత్యనాథ్‌తో మెలిండా గేట్స్ భేటీ !

Telugu Lo Computer
0


ఆరోగ్య భద్రత, ఆర్థిక సమ్మేళనం, పోషకాహారం, విద్య, మహిళా సాధికారత తదితర రంగాలలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కృషి స్ఫూర్తిదాయకమని, ఉత్తరప్రదేశ్ భారతదేశానికే కాకుండా ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుందని బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు మెలిండా గేట్స్ అన్నారు. మెలిండా గేట్స్ యూపీ సీఎం ఆధిత్యనాథ్ తో సమావేశమైన సందర్భంగా ఆరోగ్యం, పోషకాహారం, వ్యవసాయ రంగాలలో సాంకేతిక సహకారాన్ని పెంపొందించడంపై చర్చించారు. కొవిడ్-19 కట్టడి, మెదడువాపు వంటి వ్యాధుల నియంత్రణకోసం యూపీలో ఇటీవల చేసిన కృషి ఆదర్శప్రాయమని మెలిండా కొనియాడారు. టీకా పంపిణీని కూడా ఆమె ప్రశంసించారు. యూపీతో ఫౌండేషన్  బలమైన సంబంధాల గురించి మెలిండా మాట్లాడుతూ మేము ఇక్కడ ఆరోగ్యం, సామాజిక భద్రత రంగంలో చాలా కాలంగా పని చేస్తున్నామని తెలిపారు. సమాజంలోని అత్యంత బలహీన, చివరి వ్యక్తికి కూడా సౌకర్యాలు కల్పించడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఇదిలాఉంటే, వచ్చే ఏడాది ఫిబ్రవరి 10-12 తేదీల్లో లక్నోలో జరగనున్న ప్రతిపాదిత యూపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో పాల్గొనాలని మెలిండా, ఆమె సహచరులను యూపీ సీఎం ఆహ్వానించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)