విశాఖ నుంచి అరకు వన్ డే టూర్ ప్యాకేజీ !

Telugu Lo Computer
0


అరకు అందాలు చూసేందుకు వెళ్లే పర్యాటకుల సంఖ్య శీతాకాలంలో ఎక్కువ. పర్యాటకుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఓవైపు భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇప్పటికే 32 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. మరోవైపు ఐఆర్‌సీటీసీ టూరిజం వన్ డే టూర్ ప్యాకేజీ అందిస్తోంది అరకు అందాలతో పాటు, బొర్రా గుహలు ఈ టూర్ ప్యాకేజీలో కవర్ అవుతాయి. విశాఖపట్నం-అరకు రైల్ కమ్ రోడ్ ప్యాకేజీ  పేరుతో ప్రతీ రోజు ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. ఒక్క రోజులో అరకు అందాలు చూసి రావాలనుకునేవారికి ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుంది. అరకు వన్ డే టూర్ ప్యాకేజీ ప్రతీ రోజూ అందుబాటులో ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీ విశాఖపట్నంలో ప్రారంభమై విశాఖలో ముగుస్తుంది. విశాఖపట్నం వచ్చే పర్యాటకులు ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకోవచ్చు.  పర్యాటకులు అరకు చేరుకున్న తర్వాత ట్రైబల్ మ్యూజియం, టీ గార్డెన్స్, ధింసా డ్యాన్స్ చూడొచ్చు. అరకులో లంచ్ పూర్తి చేసుకున్న తర్వాత అనంతగిరి కాఫీ తోటలు, గాలికొండ వ్యూపాయింట్, బొర్రా గుహలు చూడొచ్చు. ఆ తర్వాత విశాఖపట్నం తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది. పర్యాటకులు విశాఖపట్నం రైల్వే స్టేషన్ చేరుకున్న తర్వాత టూర్ ముగుస్తుంది. ప్యాకేజీలో ఎగ్జిక్యూటీవ్ క్లాస్ పెద్దలకు రూ.3060, పిల్లలకు రూ.2670, స్లీపర్ క్లాస్ పెద్దలకు రూ.2385, పిల్లలకు రూ.2015, సెకండ్ క్లాస్ పెద్దలకు రూ.2185, పిల్లలకు రూ.1815 చెల్లించాలి. టూర్ ప్యాకేజీలో విశాఖపట్నం నుంచి అరకుకు రైలు, నాన్ ఏసీ వాహనంలో లోకల్ సైట్ సీయింగ్, అరకు నుంచి విశాఖపట్నం వరకు బస్సు ప్రయాణం కవర్ అవుతాయి. దీంతో పాటు బ్రేక్‌ఫాస్ట్, లంచ్, టీ, బొర్రా గుహల్లో ఎంట్రీ ఫీజ్ కూడా కవర్ అవుతాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)