వికలాంగుల సంక్షేమంలో తెలంగాణ నంబర్ వన్ !

Telugu Lo Computer
0


తెలంగాణలోని  సిద్ధిపేట జిల్లా కేంద్రం, కొండా భూదేవి గార్డెన్స్ లో మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుక ఘనంగానిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి హరీశ్ రావు హాజరై మాట్లాడుతూ దేశంలోనే వికలాంగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఉత్తమ రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వాన్ని గుర్తించి కేంద్రం అవార్డుతో కితాబిచ్చిందని  తెలిపారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో వికలాంగులకు వెయ్యికి మించి ఫించన్లు ఇవ్వడం లేదని,  తెలంగాణ ప్రభుత్వం మాత్రమే  ఒక్కో వికలాంగుడికి రూ.3016 చొప్పున అందిస్తున్నదని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. దివ్యాంగులలో సామర్థ్యం చూడాలని, పనితనం చూడాలని వారిని చిన్నచూపు చూడొద్దని ఆశాభావం వ్యక్తం చేశారు. దివ్యాంగులు ఆత్మ గౌరవంతో బతకాలని రాష్ట్రంలోని 5 లక్షల 69వేల 792 మందికి ప్రతీ నెలా 1700 కోట్లు పింఛను కోసం నిధులు విడుదల చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. వికలాంగుల సంక్షేమం కోసం అన్నీ రంగాలలో 5 శాతం రిజర్వేషన్, ఉద్యోగాలకు 4 శాతం, విద్యలో 3 నుంచి 4 శాతం పెంపుపై తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి వెల్లడించారు. దేశంలోనే కల్యాణ లక్ష్మీతో పాటు దివ్యాంగుల కోటా కలుపుకుని దివ్యాంగుడి పెళ్లికి రూ.2.25 లక్షల అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వానిదేనని ధీమాగా హరీశ్ రావు చెప్పారు. దివ్యాంగులు ఉపాధి అవకాశాలు, నైపుణ్య శిక్షణ, వికలాంగుల భవన్ కోరిన మేరకు మంజూరు చేయిస్తానని మంత్రి మాట ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా 14,500 మంది దివ్యాంగులను గుర్తించినట్లు, 6615 మందికి సదరం సర్టిఫికేట్ అందజేస్తున్నట్లు, అలాగే సిద్ధిపేట జిల్లా వికలాంగుల సంక్షేమం కోసం రూ.1కోటి రూపాయలు కేటాయించనున్నట్లు మంత్రి తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)