రాజమౌళికు ప్రతిష్టాత్మక అవార్డు !

Telugu Lo Computer
0


న్యూయార్క్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్ సర్కిల్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు గానూ ఉత్తమ దర్శకుడిగా రాజమౌళిని ఎంపిక చేసింది. ఈ అవార్డు సాధించిన తొలి భారతీయ దర్శకుడిగా రాజమౌళి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇంగ్లీష్ సినిమాలతో పోటీ పడి ఒక టాలీవుడ్‌ సినిమా ఈ ఘనత సాధించిందంటే రాజమౌళి గొప్పతనం ఏంటో తెలుస్తుంది. ఇటీవలే లాస్‌ ఏంజిల్స్ టైమ్స్‌ అనే ఇంగ్లీష్ పేపర్‌ రాజమౌళి గురించి ఫ్రంట్ పేజ్‌లో ఓ పెద్ద ఆర్టికల్‌ ప్రచురించింది. ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో తారక్ కొమురం భీమ్ పాత్రలో నటించగా, రామ్‌ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించాడు. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కీలకపాత్ర పోషించాడు. డివివి దానయ్య అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రంలో అలియాభట్, ఒలీవియా మొర్రీస్‌లు కథానాయికలుగా నటించారు. ఎన్నో వాయిదాల తర్వాత ఫిబ్రవరి 25న విడుదలై 'ఆర్ఆర్ఆర్' చిత్రం సంచలనం విజయం సాధించింది. ఓవరల్‌గా 1200కోట్లకు పైగా కలెక్షన్‌లు సాధించి రాజమౌళికి వరుసగా రెండోసారి 1000 కోట్ల క్లబ్‌లో నిలిచిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)