వన్యప్రాణులను అక్రమంగా తరలిస్తున్న మహిళ అరెస్టు

Telugu Lo Computer
0


జార్ఖండ్‌లోని తాతానగర్‌ రైల్వే స్టేషన్‌ దగ్గర మహారాష్ట్రలోని పుణెకు చెందిన దేవీ చంద్ర అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమె దగ్గర ఉన్న సంచుల్ని సోదా చేయగా, అందులో అరుదైన జంతువులు దర్శనమిచ్చాయి. వాటిలో కొండచిలువలు, అరుదైన పాములు, ఊసరవెల్లులతో పాటు ఇతర జీవులు కూడా ఉన్నాయి. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ ఏకంగా 50 కోట్ల రూపాయలు ఉంటుందని వారు అంటున్నారు. ఇక, ఆ జీవులు ఎక్కడివి అన్న దానిపై పోలీసులు దేవిని విచారించారు. నాగాలాండ్‌కు చెందిన ఓ వ్యక్తి వాటిని తనకు ఇచ్చినట్లు ఆమె తెలిపింది. వాటిని ఢిల్లీకి చేర్చాల్సిందిగా చెప్పాడని పేర్కొంది. ఇందుకోసం తనకు 8 వేల రూపాయలు ఇస్తున్నాడని కూడా వెల్లడించింది. తాను నాగాలాండ్‌ నుంచి గోహతీ వచ్చానని, అక్కడినుంచి పశ్చిమ బెంగాల్‌లోని హౌరాకు వచ్చానని తెలిపింది. హైరానుంచి ఢిల్లీ వెళ్లటానికి ట్రైన్‌ ఎక్కినట్లు పేర్కొంది. పోలీసులు స్వాధీనం చేసుకున్న జంతువుల్లో ఎనిమిది ఊసరవెల్లులు, ఓ పాము చనిపోయింది. కాగా, డ్రగ్స్‌ గ్యాంగ్‌ ఈ జంతువుల విషాన్ని తీసి, మత్తు మందు తయారీలో ఉపయోగిస్తుందని అధికారులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)