గుజరాత్‌ లో కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టో విడుదల

Telugu Lo Computer
0


గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్‌లో రెండు విడతలుగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ అన్నివర్గాల వారి ఓటు బ్యాంక్‌ను లక్ష్యంగా చేసుకుని హామీలు కురిపించింది. గెలుపే లక్ష్యంగా శనివారం ఆ పార్టీ మ్యానిఫెస్టోని విడుదల చేసింది. ప్రధానంగా ఆ రాష్ట్రంలో 10 లక్షలమంది గుజరాతీయులకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీనిచ్చింది. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో 50 శాతం మహిళలకు రిజర్వేషన్‌, రాష్ట్రంలోని ప్రతిఒక్క మహిళకు, వితంతు మహిళలకు, ముసలివాళ్లకు నెలకు రూ.2000 ఇస్తామని హామీనిచ్చింది. రాష్ట్రంలో మూడు వేల ఇంగ్లీష్‌ మీడియం స్కూల్స్‌ను ప్రభుత్వం ప్రారంభిస్తుందని, ఆ పాఠశాలల్లో బాలికలకు పోస్టుగ్రాడ్యుయేషన్‌ వరకు ఉచితి విద్యనందించనున్నట్లు మ్యానిఫెస్టోలో తెలిపింది. ఇక మూడు లక్షల వరకు వ్యవసాయ రుణమాఫీ, 300 యూనిట్స్‌ వరకు ఉచిత కరెంట్‌ ఇస్తామని హామీనిచ్చింది. యువతకు నిరుద్యోగ భృతిగా నెలకు మూడువేల రూపాయలు అందజేయనున్నట్లు హామీనిచ్చింది. అలాగే గ్యాస్‌ సిలిండర్‌ను రూ. 500లకే అందజేయనున్నట్లు మ్యానిఫెస్టోలో ప్రకటించింది. అహ్మదాబాద్‌లో ఉన్న నరేంద్రమోడీని స్టేడియం పేరును సర్దార్‌ పటేల్‌ స్టేడియంగా పేరు మార్చనున్నట్లు వెల్లడించింది. ఈ మ్యానిఫెస్టోపై రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌గెహ్లాట్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే.. 'పార్టీ అధికారంలోకి వస్తే మొదటి క్యాబినెట్‌ సమావేశంలోనే మ్యానిఫెస్టోని అధికారిక పత్రంగా స్వీకరిస్తుంది' అని అన్నారు. అలాగే గత 27 ఏళ్లలో అవినీతిపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి దోషులపై కేసు నమోదు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే రాష్ట్ర ప్రజలకు పది లక్షల వరకు ఉచిత వైద్యం, చికిత్సతోపాటు ఐదు లక్షల వరకు మందుల్ని అందజేయనుంది. ఇక కోవిడ్‌బారిన పడిన వారికి నాలుగు లక్షల రూపాయల్ని పరిహారంగా అందజేయనున్నట్లు ఆయన పేరొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)