రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలోని కుమ్హెర్ తాలూకాలో గల సక్రౌరా గ్రామంలో రెండు గ్రూపుల మధ్య జరిగిన హింసాత్మక ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. సముందర్, లఖన్ గ్రూపుల మధ్య ఘర్షణ జరిగినట్లు భరత్ పూర్ ఏఎస్పీ అనిల్ మీనా వెల్లడించారు. మృతులు ముగ్గురిని సముందర్, ఈశ్వర్, గజేంద్రగా గుర్తించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు ఏఎస్పీ భరత్‌పూర్ అనిల్ మీనా తెలిపారు.
No comments:
Post a Comment