హిందుస్థాన్ యూనిలీవర్ డిటర్జెంట్ ఉత్పత్తుల ధరలు తగ్గింపు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 8 October 2022

హిందుస్థాన్ యూనిలీవర్ డిటర్జెంట్ ఉత్పత్తుల ధరలు తగ్గింపు !


హిందుస్థాన్ యూనిలీవర్ డిటర్జెంట్ ఉత్పత్తుల ధరలను 2 నుంచి 19 శాతం వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. సబ్బులు, డిటర్జెంట్ పౌడర్లకు సంబంధించిన ముడి సరకుల ధరలు తగ్గినందున తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు హల్ ప్రకటించింది. పలు ఉత్పత్తులకు సంబంధించి సవరించిన రేట్ల వివరాలను హల్ తమ వెబ్ సైట్ లో ఉంచింది. సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ (500ml) ధర ప్రస్తుతం రూ.115 ఉండగా దీనిపై 3 రూపాయలు తగ్గనుంది. అలాగే రిన్ డిటర్జెంట్ పౌడర్ (1 Kg) ధర ప్రస్తుతం రూ.103 ఉండగా... 4 రూపాయలు తగ్గనుంది. లైఫ్ బాయ్ సోప్ ప్యాక్ (4 సబ్బులు each 125g) రేట్ 140 ఉండగా... దీనిపై 8 రూపాయలు తగ్గనుంది. అలాగే డవ్ సోప్ (50g) ధర ప్రస్తుతం 27 ఉండగా సవరించిన రేట్ ప్రకారం రూ.22కే రానుంది.

No comments:

Post a Comment