కేజ్రీవాల్‌పై వాటర్ బాటిల్‌ విసిరిన దుండగుడు

Telugu Lo Computer
0


గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీకి త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆప్ ఫోకస్ పెట్టింది. ఇందులోభాగంగా అరవింద్ కేజ్రీవాల్ ఆ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తూ, ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో కలిసి రెండు రోజుల పర్యటనలో భాగంగా గుజరాత్ చేరుకున్నారు. శనివారం రాజ్‌కోట్‌లోని ఖోదల్‌ధామ్ ఆలయంలో నిర్వహించిన గర్భా వేడుకలకు హాజరయ్యారు. వేదికపై ఉన్న కేజ్రీవాల్‌ ప్రజలకు అభివాదం తెలుపుతున్న సమయంలో వెనక నుంచి ఆయన వైపుగా ఓ వాటర్ బాటిల్ దూసుకొచ్చింది. అయితే, అది ఆయనను దాటుకుని వెళ్లి పడింది. కేజ్రీవాల్ వైపుగా దూసుకొస్తున్న వాటర్ బాటిల్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. గుజరాత్‌లో కేజ్రీవాల్ ఇస్తున్న హామీలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. తాము అధికారంలోకి వస్తే గుజరాత్‌లోని 33 జిల్లాల్లోనూ ప్రభుత్వ ఆసుపత్రులు నిర్మించి ఉచితంగా నాణ్యమైన చికిత్స అందిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)