తెలంగాణలో భూములు బీసీల చేతుల్లో ఉన్నాయి ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 23 October 2022

తెలంగాణలో భూములు బీసీల చేతుల్లో ఉన్నాయి !

మునుగోడు నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ 2014కు ముందు రాష్ట్రంలో కరెంటు కోతలు ఉండేవి. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు సమస్య శాశ్వతంగా పోయిందన్నారు. అంతేకాకుండా 'ఫ్లోరైడ్ సమస్య నల్గొండ జిల్లాలో ఉండే. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఇంటింటికీ నల్ల నీళ్లు ఇస్తున్నాం. రాష్ట్రంలో సింహభాగం భూములు బీసీల చేతుల్లో ఉన్నాయి. నాడు వ్యవసాయానికి ఎన్నో ఇబ్బందులు. ఇప్పుడు వ్యవసాయం పండుగ. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించుకున్నాం. దేశంలోనే బెస్ట్ గ్రామాలు 19  తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. మున్సిపాలిటీలకు అవార్డు ఇస్తే దేశంలో రెండో స్థానంలో తెలంగాణ ఉంది. నాడు కుల వృత్తులు ధ్వంసం అయ్యాయి. 57 ఏళ్ళు దాటిన వారికి 2016 పెన్షన్ ఇస్తున్నాం. రైతు భీమా తరహాలో గౌడ్స్ కు ఎక్స్ గ్రేషియా తొందరగా వచ్చే ప్రయత్నం చేస్తాం. రాష్ట్రంలోని 4098 కల్లుగీత కుటుంబాలకు 30 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాము. కల్లుగీత సొసైటీలకు లాభం కలిగేలా త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత కల్లు దుకాణాలు తెరిపించి వాటిపై ఆధారపడిన కుటుంబాలను ఆదుకున్నాం. కర్ణాటక రాష్ట్రంలో కల్లుగీతను బ్యాన్ చేస్తూ బీజేపీ ప్రభుత్వం జీవో విడుదల చేశారు. కర్ణాటకలో కల్లుగీతను పునరుద్ధరణ చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. బీజేపీ నేతలు ఇక్కడ తియ్యటి మాటలు చేబూతూ  అక్కడ అడ్డమైన పనులు చేస్తున్నారు. ఒక్కడు ధనవంతుడు అయితే దేశం బాగుపడుతుందా? ఒక్కడికి 18 వేల కోట్ల కాంట్రాక్టు ఇస్తే నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి నిధులు ఇవ్వరా? ప్రతిపక్షాలు కేసీఆర్ పై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. రైతుబందు లాగా మిగతా బంధులు పెట్టండి అంటున్నారు. మీరు మాత్రం కల్లు దుకాణాలు బంధు చేస్తారు? ముఖ్యమంత్రి కేసీఆర్ మనస్సు, ఆలోచన పెద్దది. దళితులతో మొదలు పెట్టిండు. భవిష్యత్ లో ప్రతీ ఒక్కరికీ, ప్రతీ వర్గానికి మేలు చేస్తారు. దేశం కోసం బీజేపీ ఒక్క మంచి పని చేయలేదు. అన్ని గబ్బు పనులే చేశారు. కేంద్రంలో ఇప్పటికీ బలహీన వర్గాల శాఖ పెట్టలేదు. ముందు ఆ శాఖ పెట్టాలని డిమాండ్ చేస్తున్నా. 2004లో రాష్ట్రంలోని బీసీలను తీసుకుని కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ప్రధానితో మాట్లాడారు. బీజేపీ పార్టీలో ఓబీసీ మోర్చా ఉంటది… కానీ కేంద్రంలో ఓబీసీ శాఖ ఎందుకు ఉండదు. ఇదేనా బీసీల మీద బీజేపీ ప్రేమా? రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనుకునే వారికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలి' అని మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

No comments:

Post a Comment