నేత వృత్తి దేశ వారసత్వ కళా సంపద ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 23 October 2022

నేత వృత్తి దేశ వారసత్వ కళా సంపద !


నేత వృత్తి వ్యాపారం కాదు - దేశ వారసత్వ కళాసంపదని, చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని పూర్తిగా ఎత్తేవేయాలని, మంత్రి కేటీఆర్ పిలుపుతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రధాని మోదీకి పోస్ట్ కార్డ్ రాశారు. చేనేత వృత్తి అంటే వ్యాపారం కాదని, అది మన దేశ వారసత్వ కళాసంపదనని టీఆరెఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. చేనేత కళాకారులంతా గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేదలు, బలహీన వర్గాల వారిని, అలాంటి వారిని జీఎస్టీ పేరిట దోపిడీ చేయడం సరికాదని సూచించారు. మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ రద్దు చేయాలని ఆదివారం ప్రధాని మోదీకి ఎమ్మెల్సీ కవిత పోస్ట్ కార్డు రాశారు. చేనేత పరిశ్రమ చేనేత కళాకారుడి నైపుణ్యత, సృజనాత్మకత, కష్టంపై ఆధారపడి మనుగడ సాగిస్తున్నదని, చేనేత కళాకారుడిలో వ్యాపార దృక్పథం ఏ కోశాన లేదని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్రము వచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా ఏ ప్రభుత్వమూ చేనేత ముడి సరుకులపై, చేనేత వస్త్రాలపై ఎలాంటి పన్ను విధించలేదని గుర్తు చేశారు. ఇప్పుడు మోదీ సారద్యంలోని కేంద్ర ప్రభుత్వము చేనేతకు వాడే ముడి సరుకులపై, చేనేత వస్త్రాలపై 5శాతం జీఎస్టీ విధించి, దాన్ని 12% కు పెంచాలనుకోవడం చేనేత కార్మికుల పాలిట ఉరితాడు అవుతుందని చేప్పేందుకు ఎలాంటి సందేహం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి, దేశంలోని కోట్లాది పేద చేనేత కార్మికుల జీవితాల కోసం, చేనేత ముడి సరకులపై మరియు చేనేత వస్త్రాలపై జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. చేనేత సంబంధిత వస్తువులపై గల జీఎస్టీని పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేశారు. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ 5శాతం కాదు, 12 శాతం కాదు, సున్నాశాతం ఉండాలని సూచించారు. మరోవైపు, మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపును అందుకొని చేనేతపై జీఎస్టీని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ప్రతి ఒక్కరూ ప్రధానికి పోస్ట్ కార్డ్ రాయాలని ప్రజలకు కవిత విజ్ఞప్తి చేశారు.

No comments:

Post a Comment