అసభ్యకర వీడియోలు చిత్రీకరించిన స్వీపర్ అరెస్ట్

Telugu Lo Computer
0


ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌ హాస్టల్‌లో బాలికల అసభ్యకర వీడియోలు రికార్డు చేసిన స్వీపర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.   నీట్‌ పరీక్షకు ప్రిపేర్‌ అవుతున్న ఒక యువతి సాయి నివాస్ బాలికల హాస్టల్‌లో ఉంటున్నది. అయితే అక్కడ పని చేసే స్వీపర్‌ తనకు సంబంధించిన అసభ్యకర వీడియోలు రికార్డు చేసినట్లు ఆమె ఆరోపించింది. అలాగే హాస్టల్‌లోని పలువురు బాలికలు స్నానం చేస్తుండగా తీసిన వీడియోలు కూడా అతడి మొబైల్‌ ఫోన్‌లో ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఆ హాస్టల్‌కు చెందిన పలువురు యువతులు గురువారం ఆ పోలీస్‌ స్టేషన్‌ వద్ద నిరసనకు దిగారు. ఈ సంఘటనపై పోలీసులు స్పందించాలని డిమాండ్‌ చేశారు. ఆ స్వీపర్‌ను అరెస్ట్ చేసినట్లు కళ్యాణ్‌పూర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) డీకే శుక్లా తెలిపారు. నిందితుడి నుంచి మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపినట్లు చెప్పారు. నిందితుడైన స్వీపర్‌ ఆ హాస్టల్‌లో గత ఎనిమిదేళ్లుగా పని చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)