హింస వద్దని సోనియా లేఖ

Telugu Lo Computer
0


నిరసనకారుల వెన్నంటే ఉంటామని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఓ లేఖ విడుదల చేశారు. 'అగ్నిపథ్‌కు ఒక దిశానిర్దేశం అంటూ లేదు. మీ గొంతుకను కేంద్రం పట్టించుకోవట్లేదు. చాలా మంది మాజీ సైనికాధికారులు కూడా కొత్త పథకం గురించి ప్రశ్నలు, అభ్యంతరాలు లేవనెత్తారు. కేంద్రం దగ్గర సమాధానం లేదు. నిరసనకారులు.. అహింసాయుత పద్ధతుల్లో నిరసన తెలియజేయండి. ఆర్మీ అభ్యర్థులకు కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుంది'' అంటూ సోనియా పేరిట లేఖను  పార్టీ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ విడుదల చేశారు. కరోనాతో ఢిల్లీ గంగారాం ఆస్పత్రిలో ప్రస్తుతం సోనియా గాంధీ చికిత్స పొందుతున్నారు. ''పథకానికి వ్యతిరేకంగా మీ ప్రయోజనాలను పరిరక్షిస్తామన్న వాగ్దానానికి.. భారత జాతీయ కాంగ్రెస్ కట్టుబడి ఉంటుంది. నిజమైన దేశభక్తితో హింసకు తావులేకుండా సహనంతో మీ తరపున మా గొంతుకను వినిపిస్తాం.. మీరూ అహింసా మార్గంలోనే నిరసనలు చేపట్టండి.. అంటూ లేఖలో విజ్ఞప్తి చేశారు.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)