ఈ కేఫ్‌ 5 స్టార్‌, 7 స్టార్‌ కాదు, 10 స్టార్‌ విడిది !

Telugu Lo Computer
0


ఆనంద్‌ మహీంద్రా తాజాగా ఓ కేఫ్‌ వీడియోను పోస్ట్‌ చేశారు. దానికి ఏకంగా 10 స్టార్‌ రేటింగ్‌ ఇచ్చారు. మరి ఆ కేఫ్‌కు అంత ప్రత్యేకత ఏంటంటే దాన్ని నడుపుతున్నది మన భారత సైన్యం. కాశ్మీర్‌లో గురెజ్‌ వ్యాలీలో ఆర్మీ లాంగ్‌ హట్‌ పేరుతో ఓ కేఫ్‌ను నిర్వహిస్తోంది. ఎత్తైన మంచుకొండల మధ్య, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండే ఈ అందమైన కేఫ్‌ గురించి గరిమా గోయల్‌ అనే బ్లాగర్ ఓ టూర్‌ వీడియో చేశారు. అక్కడ కూర్చుంటే ప్రకృతి ఒడిలో ఉన్నంత హాయిగా ఉందన్న ఆమె.. కేఫ్‌లోని పదార్థాలు కూడా ఎంతో రుచిగా ఉన్నాయని కితాబిచ్చారు. భారత సైన్యానికి మద్దతుగా ప్రతి ఒక్కరూ ఈ కేఫ్‌ను సందర్శించాలని కోరారు. ఈ వీడియో వైరల్‌ అవడంతో ఆనంద్‌ మహీంద్రా దృష్టిని ఆకర్షించింది. ఈ వీడియోను షేర్‌ చేసిన మహీంద్రా.. ''నా వరకు.. ఈ కేఫ్‌ 5 స్టార్‌, 7 స్టార్‌ కాదు.. ఏకంగా 10 స్టార్‌ విడిది'' అని రాసుకొచ్చారు. మహీంద్రా ట్వీట్‌కు అనేక మంది నెటిజన్లు కామెంట్లు చేశారు. కొందరైతే ఆర్మీ నడుపుతోన్న ఇతర కేఫ్‌లు, స్టోర్ల గురించి చెబుతూ పోస్టులు పెట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)