12 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయండి !

Telugu Lo Computer
0

 


12 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కార్యాలయంలో ఈ మేరకు పిటిషన్ వేసింది. శివసేన బుధవారం నిర్వహించిన శాసనసభా పక్ష సమావేశానికి వారు గైర్హాజరయ్యారని తెలిపింది. ఆ సమావేశానికి హాజరుకాకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తాము ముందే నోటీసులు పంపామని చెప్పింది. దీంతో ఆ 12 మంది నేతల శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరింది. ముందుగానే నోటీసులు పంపినప్పటికీ వారు ఈ సమావేశానికి హాజరు కాలేదని, మరికొందరు అనవసర కారణాలు చెబుతూ గైర్హాజరయ్యారని చెప్పింది. సమావేశానికి హాజరు కానందుకు వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. షిండేతో పాటు ప్రకాశ్ సుర్వీ, తానాజీ సావంత్, మహేశ్ షిండే, అబ్దుల్ సత్తార్, సందీప్ భుమారె, భరత్ గోవావాలే, సంజయ్ శిర్రత్, యామిని యాదవ్, అనిత్ బాబర్, బాలాజీ దేవదాస్, లతా చౌదరిల శాసనసభ సభ్యతర్వాన్ని రద్దు చేయాలని పేర్కొంది. ఈ పిటిషన్‌ను శాసనసభా పక్ష నేత అజయ్ చౌదరి దాఖలు చేశారు. షిండేను శాసనసభా పక్ష నేత హోదా నుంచి తొలగించిన శివసేన ఆ స్థానంలో ఇటీవలే అజయ్ చౌదరిని నియమించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)