నులి పురుగుల నివారణ మందు వేసుకొన్న విద్యార్థులకు తీవ్ర అస్వస్థత

Telugu Lo Computer
0


బీహార్‌లోని భాగల్‌పూర్‌, ముంగేర్ పాఠశాల పిల్లలకు నులి పురుగు నివారణా మందులను పాఠశాల యాజమాన్యం ఉచితంగా పంపిణీ చేసింది. ఈ మందు తీసుకున్న 80 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొందరు స్పృహ తప్పి కింద పడిపోయారు. ఈ 80 మందిలో ప్రస్తుతం 12 మంది విద్యార్థులు వెంటిలేటర్‌పై వున్నారు. దీంతో తల్లిదండ్రులు పాఠశాలల ముందు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. వైద్య సిబ్బందిని ఓ గదిలో బంధించారు. . ఈ ఘటనను చూసి, ఉపాధ్యాయులు అక్కడి నుంచి పారిపోయారు. ఇక.. అస్వస్థతకు గురైన విద్యార్థులను దగ్గర్లోని ఆస్పత్రిలో చేర్పించారు. పిల్లలకు ఎల్బెండాజోల్ అనే మందును ఇవ్వడానికి వైద్యాధికారులు పాఠశాలలకు వచ్చారు. ఈ మందును తీసుకోగానే.. దాదాపు 80 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 30 మంది పిల్లలు అప్పటికప్పుడే వాంతులు, విరేచనాలు చేసుకుంటూ, స్పృహ తప్పిపడిపోయారు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో.. పాఠశాలలకు చేరుకొని, వైద్య సిబ్బందిని బంధించారు. చివరికి… ఉన్నతాధికారులు అక్కడికి చేరుకొని, వైద్య సిబ్బందిని విడిపించారు. పిల్లలను ఆస్పత్రిలో చేర్పించి, చికిత్స అందిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)