ఉక్రెయిన్ లో ఉచితంగా కార్లకు ఛార్జింగ్ సౌకర్యం : టెస్లా

Telugu Lo Computer
0


టెస్లా కార్ల తయారీ కంపెనీ ఉక్రెయిన్ నుంచి తరలిపోతున్న ప్రజలకు ఉచిత ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్‌ను అందిస్తామని ప్రకటించింది. రష్యా సైనిక దాడి నేపథ్యంలో ప్రజలు సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుగా సహాయ పడేందుకు ఉచితంగా కార్లకు ఛార్జింగ్ సౌకర్యం కల్పిస్తున్నట్లు టెస్లా తెలిపింది.టెస్లా, నాన్-టెస్లా ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ కోసం ఛార్జింగ్ స్టేషన్లను సిద్ధం చేసినట్లు టెస్లా ఈమెయిల్‌లో ప్రకటించింది.ఉక్రెయిన్ దేశ సరిహద్దుల్లోని ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ కోసం ట్ర్జెబౌనిస్కో (పోలాండ్), కోయిస్ (స్లోవేకియా), మిస్కోల్క్ (హంగేరి)లలో టెస్లా కార్ల తయారీ కంపెనీ విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసింది.యుద్దాలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు టెస్లా కంపెనీ విద్యుత్ వాహనాలకు ఉచితంగా ఛార్జింగ్ చేసుకునేందుకు కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)