చెన్నై మేయర్‌ గా తొలి దళిత మహిళ

Telugu Lo Computer
0


చెన్నై నగర పాలక సంస్థ మేయర్‌గా  28 ఏళ్ల ఆర్‌ ప్రియను ఈ పదవికి డిఎంకె నామినేట్‌ చేసింది. తొలిసారి ఒక దళిత మహిళ ఎన్నిక కానున్నారు. ఈ పీఠాన్ని అలంకరించిన తొలి దళిత వ్యక్తిగానే కాకుండా అతి పిన్న వయస్కురాలుగానూ, మూడో మహిళగానూ కూడా ఆమె రికార్డు సృష్టించనున్నారు. నార్త్‌ చెన్నై లోని తిరువికా నగర్‌కు చెందిన ఆర్‌ ప్రియ 74వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా గెలుపొందారు. శుక్రవారం గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (జిసిసి) మేయర్‌, చైర్‌పర్సన్ల ఎన్నిక జరగనుంది. జిసిసిలో 200 వార్డులు ఉండగా డిఎంకె 153 స్థానాల్లో విజయం సాధించింది. చెన్నైకు గతంలో తారా చెరియన్‌, కామాక్షి జయరామన్‌లు మహిళా మేయర్లుగా పనిచేశారు. ప్రియా మూడో మహిళగా నిలవనున్నారు. ప్రియకు బలమైన రాజకీయ నేపధ్యం ఉంది. ప్రియా తాతయ్య చెంగయ్య శివం గతంలో డిఎంకె నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆమె తండ్రి ఆర్‌ రాజన్‌ ఈ ప్రాంత డిఎంకె సహ కార్యదర్శిగా ఉన్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)