భార్యపై లైంగిక దాడి కూడా అత్యాచారమే!

Telugu Lo Computer
0


కర్ణాటకకు చెందిన ఒక మహిళ, తన భర్త లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. భర్త అయినప్పటికీ మనిషి మనిషేనని, భర్త అయిన పురుషుడి లైంగిక దాడి దారుణమైన నేరమేనని తెలిపింది. భార్య అయిన మహిళపై భర్త లైంగిక దాడి అత్యాచారమేని కోర్టు వ్యాఖ్యానించింది. అలాగే భార్యపై లైంగిక దాడికి వివాహం లైసెన్స్‌ కాదని హైకోర్టు తెలిపింది. భార్యపై అత్యాచారానికి ఎలాంటి ప్రత్యేక హక్కును భర్తకు వివాహం ఇవ్వదని పేర్కొంది. క్రూరమైన మృగాన్ని శిక్షించకుండా విడిచిపెట్టేందుకు ఎలాంటి వివాహ వ్యవస్థ అనుమతించదని కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యానించింది. భర్తలు తమ భార్యలకు పాలకులని, వారి శరీరం, మనస్సు, ఆత్మను ప్రభావితం చేయాలనేది పురాతన ఆలోచన, సంప్రదాయం అని హైకోర్టు తెలిపింది. దీని వల్లనే దేశంలో ఇలాంటి ఘటనలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని పేర్కొంది. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించడంపై చట్టసభలు నిర్ణయం తీసుకోవాలని కోర్టు సూచించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)