సీఎం సార్‌ హెల్ప్‌ మీ !

Telugu Lo Computer
0


తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సీఎం ఎంకే స్టాలిన్‌ తనదైన పాలనతో ప్రజలకు చేరువవుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం అసెంబ్లీకి వెళ్తున్న సమయంలో చెన్నైలోని టీటీకే రోడ్‌లో ఓ యువకుడు 'సీఎం సార్‌ హెల్ప్‌ మీ' అంటూ ప్లకార్డును పట్టుకుని నిల్చొని ఉండగా, దీనిని గమనించిన సీఎం స్టాలిన్‌ తన కారును ఆపి ఆ యువకుడితో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం​ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎన్‌ సతీష్‌ దేశమంతటా నీట్‌ మినహాయింపులు తీసుకు వచ్చేలా చూడాలని సీఎం స్టాలిన్‌ను విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే తమిళనాడులో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పరీక్షలను వ్యతిరేకిస్తున్నందుకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉండగా.. తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం నీట్‌ రద్దు కోసం చర్యలను వేగవంతం చేసింది. ఈ వ్యవహారంలో అన్ని రాష్ట్రాల ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తామని, విద్యార్థుల భవిష్యత్‌ కోసం ఎంతవరకైనా వెళ్తామని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)