పెళ్లి వార్తలు పుకార్లే : విజయ్ దేవరకొండ

Telugu Lo Computer
0


విజయ్ దేవరకొండ రష్మిక మందన్నా పెళ్లి చేసుకోబోతున్నారు.. ఈ ఏడాది చివర్లో వారి పెళ్లి ఉంటుంది అంటూ మీడియాలో పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేశాయి. గత రెండు రోజులుగా ఈ వార్తలను ప్రముఖ మీడియా సంస్థలు కూడా కవర్ చేయడంతో అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. నిజంగానే వీరిద్దరు పెళ్లి చేసుకుంటారా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. వీరిద్దరి పెళ్లి గురించి వార్తలు రావడం ఇదే మొదటి సారి ఏమి కాదు. గతంలో కూడా పలు సార్లు ఇలాంటి వార్తలు వచ్చాయి. పలు వేదికలపై వీరు కలిసిన సందర్భాల్లో కూడా వీరు పెళ్లి చేసుకుంటారని ప్రచారం జరిగింది. కానీ ఈసారి ప్రచారం పిక్స్ కి చేరింది. ఎప్పటిలాగే మేమిద్దరం స్నేహితులం మాత్రమే.. మాకు లవ్‌ ఇంట్రెస్ట్ లేదు అంటూ విజయ్ దేవరకొండ క్లారిటీ ఇస్తే సరిపోయేది కానీ ఈ సారి కాస్త సీరియస్ గా ఆయన పుకార్లను ఖండించడం జరిగింది. పుకార్లను ఖండిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక విధంగా ఆయనని విమర్శల పాలు చేసింది అనడంలో సందేహం లేదు. స్టార్ హీరో అయినా విజయ్ దేవరకొండ బూతులు మాట్లాడుతూ అది కూడా బి గ్రేడ్ బూతులు మాట్లాడుతూ ట్వీట్ చేయడం ఆయన అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు. 

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)