భర్త శృంగారం చేయడం లేదని పోలీసులను ఆశ్రయించిన మహిళ - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 24 February 2022

భర్త శృంగారం చేయడం లేదని పోలీసులను ఆశ్రయించిన మహిళ


అహ్మదాబాద్ కు చెందిన 33 ఏళ్ల మహిళ తన భర్త తనతో శృంగారం చేయడం లేదని పోలీసులను ఆశ్రయించింది. ఏడాది క్రితమే పెళ్లయిన ఆ మహిళ ఇటీవల మనస్థాపానికి గురైంది. ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోవడానికి భర్త ఇష్టపడకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. అంతేకాదు మహిళ భర్త ఆమెతో శారీరక సంబంధం పెట్టుకోకుండా ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించడం మొదలుపెట్టాడు. కొంతకాలంపాటు భర్త పెట్టిన ఈ బాధలను బాధితురాలు భరించింది. భర్తలో ఎప్పుడో ఒకప్పుడు మార్పు వస్తుందని నమ్మింది. కానీ బాధితురాలి భర్త ఏ మాత్రం మారలేదు. అతడిలోని శాడిజం ఇంకా పెరిగిపోయింది. గత ఏడాది ఫిబ్రవరిలో వడోదరలోని వ్యక్తితో తనకు పెళ్లి అయ్యిందని అయినా అప్పటి నుంచి ఇప్పటి వరకు  తనకు తన భర్తతో శారీరక సంబంధం లేదని సబర్మతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తన భర్త తనతో శృంగారం చేసేందుకు నిరాకరిస్తున్నాడని ఆరోపించింది.  అంతేకాదు సహజపద్ధతితో కాకుండా ఐవీఎఫ్ ద్వారా తన భర్త తనకు బిడ్డ కావాలని కోరాడని మహిళ పోలీసులకు తెలిపింది. ఇందుకు తానూ అంగీకరించలేదంది. దీంతో భర్త ఆమెను శారీరకంగా హింసించాడు. అంతేకాదు ఆమెను ఇంటి నుంచి బయటకు పంపించాడు. భర్త వైఖరితో విసిగిపోయిన భార్య.. తన పుట్టింటికి వెళ్లిపోయింది. తల్లితో కలిసి ఉంటోంది. అనంతరం పోలీసులను ఆశ్రయించిన మహిళ... భర్త నుంచి తనకు నష్టపరిహారంగా రూ. 25 లక్షలు ఇప్పించాలని డిమాండ్ చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి కోర్టుకు సమర్పించారు.

No comments:

Post a Comment