తస్మాత్ జాగ్రత్త!

Telugu Lo Computer
0


ఫేస్‌బుక్ యూజర్ల అకౌంట్లపై ఓ కొత్త వైరస్ ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే ఈ కొత్త వైరస్ చాలా అకౌంట్లను హ్యాక్ చేసింది. ఫేస్‌బుక్‌తో పాటు గూగుల్ అకౌంట్లను కూడా ఈ వైరస్ ఎటాక్ చేసింది. చెక్ పాయింట్ రీసెర్చ్‌కు చెందిన ఓ నివేదిక ప్రకారం కొత్త మాల్వేర్ ఎలక్ట్రాన్ బాట్ వెలుగులోకి వచ్చింది. ఇది సోషల్ మీడియా అకౌంట్లపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ రిపోర్ట్స్ ప్రకారం వైరస్ యూజర్లకు చెందిన గూగుల్, ఫేస్‌బుక్ ఎక్కౌంట్లపై దాడి చేస్తోంది. ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా 5వేలకు పైగా ఎక్కౌంట్లను హ్యాక్ చేసింది. చాలా సులభంగా ఇతర యాప్స్ ద్వారా మీఅ కౌంట్ల యాక్సెస్ తీసుకుంటుంది. ముఖ్యంగా టెంపుల్ రన్, సబ్‌వే సర్ఫర్ వంటి గేమ్స్ ద్వారా ఈ మాల్వేర్ విస్తరించిందని తెలుస్తోంది. అక్కడి నుంచి మీ సోషల్ మీడియా అకౌంట్ లను యాక్సెస్ చేస్తుంది. వాస్తవానికి ఈ గేమ్స్ యాప్స్‌ను మాధ్యమంగా చేసుకుని యూజర్ల అకౌంట్ లపై ఎలక్ట్రాన్ బాట్ దాడి చేయడం ప్రారంభిస్తోంది. ఈ ఎలక్ట్రాన్ బాట్ అనే మాల్వేర్ మీ సిస్టమ్‌ను కంట్రోల్ చేస్తూ..ఫేస్‌బుక్, గూగుల్ అకౌంట్ లకు చెందిన పూర్తి సమాచారాన్ని యాక్సెస్ చేస్తుంది. ఈ మాల్వేర్ సహాయంతో హ్యాకర్..యూజర్ డివైస్‌పై ఓ కొత్త అకౌంట్  రిజిస్టర్ చేస్తాడు. దాని ద్వారా యూజర్‌కు చెందిన సోషల్ మీడియా అకౌంట్ లను వినియోగించుకుంటాడు. ఈ వైరస్..గూగుల్‌కు చెందిన ఆల్బమ్స్ యాప్, గూగుల్ ఫోటోస్‌లో కన్పించింది. అంటే ఈ యాప్స్ ద్వారా వైరస్ మీ స్మార్ట్‌ఫోన్‌లో ఎంటర్ కాగలదు. ఇటువంటి వైరస్ నుంచి సురక్షితంగా ఉండాలంటే మీ ఫోన్‌లో యాంటీ వైరస్ యాప్ డౌన్ లోడ్ చేయడం మర్చిపోవద్దు. ఏ విధన థర్డ్ పార్టీ యాప్‌ను డౌన్ లోడ్ చేయవద్దు. ఎందుకంటే దాని ద్వారా వైరస్ మీ స్మార్ట్‌ఫోన్‌లో ప్రవేశిస్తుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)