ఆర్టీసీ బస్సులో బాలికపట్ల అసభ్య ప్రవర్తన !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా దుత్తలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కడప పట్టణంలోని పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న పిచ్చాపాటీ నారాయణ రెడ్డి అనే వ్యక్తి గుంటూరు కు వెళ్లేందుకు కడపకు చెందిన ఆర్టీసీ బస్సు ఎక్కాడు. అదే బస్సులో కడప సమీపంలోని చెన్నూరు వద్ద ఓ కుటుంబం ఒంగోలుకు వెళ్లేందుకు ఎక్కారు. అయితే, తమ ఎనిమిదేళ్ల మైనర్ బాలికను నారాయణ రెడ్డి పక్కన సీట్లో కూర్చోబెట్టారు ఆ దంపతులు. పాప తన పక్కన కూర్చున్న తరువాత అతనిలోని కామాంధుడు బయటకు వచ్చాడు. ఆ పాపతో అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో.. బాలిక తల్లిదండ్రులు నారాయణ రెడ్డి పై గొడవకు దిగారు. అప్పటికే బస్సు నెల్లూరు జిల్లా దుత్తలూరు పోలీస్ స్టేషన్ సమీపానికి చేరుకోవడంతో అక్కడ అతనిపై బాలిక తల్లిదండ్రులు, ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. దీంతో దుత్తలూరు పోలీసులు నిందితుడు నారాయణ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ బాజిరెడ్డి తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)