తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచిందన్నట్లు!

Telugu Lo Computer
0


ఓ యువకుడు రేస్‌ బైక్‌ వేసుకొని చిన్న గల్లీలోకి వచ్చాడు. ఆ సమయంలో రోడ్డంతా వాహనాలతో నిండిపోయింది. దీంతో అత్యుత్సాహాన్ని ప్రదర్శించాలనుకున్న సదరు కుర్రాడు బైక్‌ను ఒక్కసారిగా రేస్‌చేసి ముందు టైర్‌ను గాల్లోకి లేపాడు. అక్కడున్న వారంతా తనని చూసి ఆశ్చర్యపోవాలనుకున్నాడా కుర్రాడు. అయితే తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచిందన్నట్లు బైక్‌ అదుపు తప్పి ముందున్న కారును వేగంగా ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా బైక్‌తో సహా కింద పడిపోయాడు. అయితే తలకు హెల్మెట్‌, జర్కిన్‌ ధరించడంతో గాయాల నుంచి తప్పించుకున్నట్లు కనిపిస్తోంది. దీనంతటినీ వెనకాల బైక్‌పై వస్తోన్న ఓ వ్యక్తి మొబైల్‌లో రికార్డ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)