ప్రేమికురాలి విజయం !

Telugu Lo Computer
0


గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలంలోని లక్కరాజు గార్లపాడుకు చెందిన అనంతకుమార్‌ రష్యాలో చదువుకునేందుకు వెళ్లాడు. తమిళనాడులోని మధురైకి చెందిన సెల్ఫియ గుణశీలన అనే యువతి అక్కడే ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం చదువుతుంది. ఒకే కళాశాలలో చదువుకుంటున్న ఇద్దరూ ప్రేమించుకున్నారు. కొద్దిరోజుల క్రితం అనంతకుమార్‌ స్వగ్రామం వచ్చి మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ విషయం రష్యాలోని ప్రేమికురాలికి తెలిసింది. వెంటనే ఆమె సత్తెనపల్లికి చెందిన జనసేన నాయకుడు కొమ్మిశెట్టి సాంబశివరావు నెంబర్‌ సంపాదించి ఫోన్ చేసి అనంతకుమార్‌ ప్రేమ విషయం తెలిపింది. ఆ తర్వాత ఆమె ఈ నెల 6న సత్తెనపల్లికి రాగా సాంబశివరావుతో కలిసి రూరల్‌ పోలీసులను సంప్రదించారు. దీంతో పోలీసులు యువకుడ్ని, తల్లిదండ్రులతో చర్చించి నిశ్చితార్థాన్ని రద్దు చేయించి సెల్ఫియతో పెళ్లికి ఒప్పించారు. మంగళవారం పెద్దల సమక్షంలో స్థానిక వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో సెల్ఫియా మెడలో అనంతకుమార్‌ తాళి కట్టడంతో ప్రేమపెళ్లి సుఖాంతమైంది.

Post a Comment

0Comments

Post a Comment (0)