ఏడునిమిషాల్లోనే కోటీశ్వరుడైన యూట్యూబర్‌ ఫోష్‌

Telugu Lo Computer
0


బ్రిటన్ కి చెందిన యూట్యూబర్‌ మాక్స్ ఫోష్ ఒక కంపెనీని ఏర్పాటు చేశాడు. ఫోష్‌ కంపెనీ పెట్టే నిమిత్తం ఆ కంపెనీ హౌస్‌కి సంబంధించిన ఫారంని పూర్తి చేశాడు. కంపెనీ పేరుకు చివర కచ్చితంగా లిమిటెడ్‌తో ముగియాలి. అందుకని ఫోష్‌ తన కంపెనీ వెంచర్‌కి అన్‌ లిమిటెడ్‌ మనీ లిమిటెడ్‌ అని పేరు పెట్టాడు. పైగా తన కంపెనీ షేర్లను 10 బిలినియన్లగా నిర్ణయించి రిజిస్టర్‌ చేయించాడు ఫోష్. ఆ షేర్లలో ఒక దానిని 50 పౌండ్లకు విక్రయిస్తే, అతని కంపెనీకి చట్టబద్ధంగా 500 బిలియన్ పౌండ్లు విలువ ఇస్తుంది. ఆ యూట్యూబర్ లండన్ వీధిలో రెండు కుర్చీలు, టేబుల్‌తో తన ఆఫీస్‌ను ఏర్పాటు చేశాడు. మొదట్లో పెట్టుబడిదారుల కోసం కొంత ఇబ్బంది పడినా, ఆ తర్వాత ఒక మహిళ అతని కంపెనీలో 50 పౌండ్లకు ఒక షేర్‌ని కొనుగోలు చేసింది. దీంతో అతను ఏడు నిమిషాల పాటు ఎలెన్‌ మాస్క్‌ని అధిగమించి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడయ్యాడు. ఇక్కడే అసలు ట్విస్ట్‌ ఉంది. ఆ తర్వాత అతనికి అధికారుల నుంచి ఒక లేఖను వచ్చింది. మనీ లిమిటెడ్ మార్కెట్ క్యాప్ 500 బిలియన్ పౌండ్‌లుగా అంచనా వేశారని, ఆదాయ కార్యకలాపాలు లేకపోవడం వల్ల, మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొవలసి వస్తుందని అధికారులు వార్నింగ్‌ ఇచ్చారు. అందువల్ల అన్‌లిమిటెడ్ మనీ లిమిటెడ్‌ను రద్దు చేయాలని చెప్పారు. దీంతో ఫోష్‌ ఆ పని చేయక తప్పలేదు. ఈ తతంగానికి సంబంధించిన ఓ వీడియోని ఫోష్ నెటిజన్లతో పంచుకున్నాడు.


Post a Comment

0Comments

Post a Comment (0)