ఓటింగ్‌ కు భారత్‌, చైనా దూరం

Telugu Lo Computer
0


ఉక్రెయిన్‌ పై రష్యా యుద్దానికి దిగిన నేపధ్యంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఓటింగ్‌కు భారత్‌ దూరంగా ఉన్నది. ఉక్రెయిన్‌ పై రష్యా దాడి నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమయింది. రష్యా దాడిని ఖండిస్తూ భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానాన్ని రష్యా వీటో చేసింది. మండలిలోని మొత్తం 15 సభ్యదేశాల్లో 11 దేశాలు రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేశాయి. అయితే మొదటి నుంచి ఉక్రెయిన్‌-రష్యా వివాదంలో తటస్థంగా ఉన్న భారత్‌తో పాటు చైనా, యూఏఈలు ఈ ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. కాగా, భద్రతా మండలిలో ఐదు శాశ్వత దేశాల్లో ఒకటైన రష్యా తన వీటో అధికారాన్ని ఉపయోగించి ముసాయిదాను తిరస్కరించింది. ఉక్రెయిన్‌లో ఇటీవలి పరిణామాలతో భారతదేశం చాలా కలత చెందుతోందని ఐక్యరాజ్యసమితిలో భారత ప్రతినిధి తిరుమూర్తి అన్నారు. హింస మరియు శత్రుత్వాన్ని వెంటనే అంతం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేయాలని మేము కోరుతున్నాము. మనిషి ప్రాణాలను పణంగా పెట్టి ఎప్పటికీ పరిష్కారం దొరకదని ఆయన పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)