మేక పిల్ల కోసం ప్రాణాలకు తెగించిన యువకుడు!

Telugu Lo Computer
0

 

మేక పిల్లను కాపాడేందుకు తన ప్రాణాలను పణంగా పెట్టి ఇతర స్నేహితుల సాయంతో బోరు బావిలోకి దూరాడు ఓ వ్యక్తి. మొత్తానికి మేక ప్రాణాలను సురక్షితంగా కాపాడాడు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. వ్యవసాయ క్షేత్రంలో నిరుపయోగంగా ఉన్న బోరు బావి ఉంది. మేత మేస్తూ ఓ మేక పిల్ల అందులో పడిపోయింది. ఇది గమనించిన స్థానికులు దానిని కాపాడేందుకు ప్రయత్నించారు. అయితే, మేక పిల్ల  ఆ గోయ్యి లోపలికి జారుకోవడంతో కష్టంగా మారింది. దీంతో అక్కడ ఉన్న వ్యక్తి ఆ గొయ్యిలోకి దూరి మేక పిల్లను బయటకు తీసేందుకు సిద్ధమయ్యాడు. మిగతా స్నేహితులు అతని కాళ్లు పట్టుకోగా అతను బోరుబావిలోకి దూరాడు. లోపల ఇరుక్కుపోయిన మేక పిల్ల చేతికి అందగానే పైన ఉన్న స్నేహితులు అతన్ని పైకి లాగారు. కాగా, దీనంతటినీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఆ వీడియో కాస్తా వైరల్ అవుతోంది. మేక కోసం ప్రాణాలకు తెగించి లోతైన గొయ్యిలోకి ప్రవేశించడం పట్ల నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. వీడియో చూస్తే గూస్‌బంప్స్ వస్తున్నాయని నెటిజన్లు పేర్కొంటున్నారు. వారి మానవత్వానికి సెల్యూట్ కొడుతున్నారు. ఇది జంతువుల పట్ల నిజమైన ప్రేమ అని కొనియాడుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)