మా నాన్న ఎంపీటీసీ....!

Telugu Lo Computer
0


తెలంగాణ లోని సిద్దిపేటలో వాహనాలు తనిఖీ చేస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు స్కూటీ మీద వెళ్తున్న ఓ బాలుడిని ఆపేశారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉందా? అని ఆరా తీశారు. అయితే తనకు ఏమీ లేవని, మా నాన్న ఎంపీటీసీ కనుక తనను ఆపకూడదని ట్రాఫిక్‌ పోలీసులకే ఎదురు సమాధానం ఇచ్చాడా బాలుడు. నన్నే ఆపుతారా అంటు వీర లెవల్లో రెచ్చిపోయాడు. దీంతో బాలుడి తండ్రికి ఫోన్‌ చేశారు ట్రాఫిక్‌ పోలీసులు. 8వ తరగతి చదువుతున్న మైనర్‌ బాలుడి చేతికి స్కూటీని ఎలా ఇచ్చారని క్లాస్‌ తీసుకున్నారు. పెద్ద వాళ్లు ఎవరైనా వస్తేనే స్కూటీని ఇస్తామని, లేదంటే ఇక్కడే ఉంటుందని తెలిపారు. మరోసారి మైనర్‌ బాలుడికి స్కూటీ ఇచ్చి రోడ్డు మీదకి వదిలేస్తే బండి సీజ్‌ చేస్తామని బాలుడి తండ్రికి వార్నింగ్‌ ఇచ్చారు ట్రాఫిక్‌ పోలీసులు. మైనర్లకు వాహనాలు నడిపేందుకు అనుమతి లేదని మరోసారి గుర్తు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)