బస్సు డ్రైవర్ ఆత్మహత్యాయత్నం ?

Telugu Lo Computer
0


తెలంగాణ లోని  హుజూరాబాద్ ఆర్టీసీ డిపోలో బస్సు డ్రైవర్ఆత్మహయత్నానికి పాల్పడటం కలకలం సృష్టిస్తోంది. విధుల్లో భాగంగా రాజయ్య ఈ నెల 19 న వంగర నైట్ హాల్ట్ బస్ నడుపుతుండగా సైదాపూర్ మండలం రాయికల్ వద్దకు రాగానే ద్విచక్ర వాహన దారుడైన శంకర్‌కు బంపర్ తగలడంతో కుడి కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. అదే బస్‌లో శంకర్ ను హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా శంకర్ కుడికాలు తొలగించారు. ప్రమాదానికి సంబంధించిన విచారణ పూర్తయ్యే వరకు రాజయ్య పార్కింగ్ విధులను నిర్వహించాలని డిపో మేనేజర్ రజని కృష్ణ ఆదేశాలిచ్చారు. శంకర్ కుటుంబ సభ్యులు, రాజయ్యతో శుక్రవారం రాజీ కుదుర్చుకోవడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే విధుల్లో ఉన్న రాజయ్య ఉదయం 5 గంటల సమయంలో డిపో ఆవరణలోనే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గమనించిన సెక్యూరిటీ సిబ్బంది చికిత్స కోసం హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ల సూచనతో రాజయ్యను మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రాజయ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆర్టీసీ అధికారులు తెలిపారు.మరో 5 నెలల్లో పదవీ విరమణ చేయనున్న రాజయ్య భయాందోళనకు గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన శంకర్ కుడి కాలు తొలగించడంతో నష్ట పరిహారం ఎంత చెల్లించాల్సి వస్తుందోనని రాజయ్య మనస్తాపానికి గురయ్యాడు. పదవీ విరమణ సమయంలో వచ్చే కొద్దీ పాటి డబ్బులు బాధితునికి చెల్లిస్తే తన కుటుంబ పరిస్థితి ఏమిటని ఆవేదన చెందే రాజయ్య రాజీకి కొన్ని గంటల ముందు ఆత్మహత్యాయత్నాకి పాల్పడ్డాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 


Post a Comment

0Comments

Post a Comment (0)