పీఆర్సీపై ఉద్యోగుల అసహనం!

Telugu Lo Computer
0


ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ ఉత్తర్వులపై ఉద్యోగులు ఆసహనం వ్యక్తం చేశారు. కొత్త వేతనాలు వస్తాయని ఎదురుచూస్తుంటే ప్రభుత్వం తమను నిరాశకు గురిచేసిందని ఆందోళన చెందుతున్నారు. కొత్త పీఆర్సీ అమలు చేయడం కన్నా పాత పీఆర్సీ కొనసాగిస్తూ ఇదే మధ్యంతర భృతితో, డీఏలన్నీ అమలుచేస్తే ఇంతకన్నా ఎక్కువ జీతాలు వస్తాయని వారు విశ్లేషిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. కొత్త వేతన సవరణతో తమకు ఒరిగేది ఏమీ లేదంటున్నారు. కొత్త వేతనాలు వస్తాయని ఎదురుచూస్తుంటే ప్రభుత్వం తమను నిరాశకు గురిచేసిందని ఆందోళన చెందుతున్నారు. డీఏలు ఒకేసారి ఇవ్వడం వల్ల జీతాల్లో పెరుగుదల తప్ప కొత్త వేతన సవరణతో అదనంగా అందే జీతం ఏమీలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీఆర్సీ కోసం వేయి కళ్లతో వేచిచూసిన తమకు ఇంత నిరాశాజనక పరిస్థితులు ఎదురవుతాయని ఊహించలేదని ఆందోళన వ్యక్తంచేశారు. కొత్త పీఆర్సీ అమలు చేయడం కన్నా పాత పీఆర్సీ కొనసాగిస్తూ ఇదే మధ్యంతర భృతితో, డీఏలన్నీ అమలుచేస్తే ఇంతకన్నా ఎక్కువ జీతాలు వస్తాయని వారు విశ్లేషిస్తున్నారు. అమల్లో ఉన్న పాత పీఆర్సీ, 27% మధ్యంతర భృతి, ఎప్పటినుంచో పెండింగులో ఉన్న కరవుభత్యం, పాత ఇంటి అద్దెభత్యం కలిపి లెక్కిస్తే కొత్త జీతం కన్నా పాత జీతమే ఎక్కువని చెబుతున్నారు. రాష్ట్ర సచివాలయంలో పనిచేసే ఉద్యోగి మాట్లాడుతూ తమకు ఇంటి అద్దెభత్యం, ఐఆర్‌, సీసీఏ రూపంలో దాదాపు 21% కోత పెట్టి, డీఏల రూపంలో 20.02 ఇచ్చారని, అంతకన్నా సాధించింది ఏముందని వ్యాఖ్యానించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)