టంగ్ స్లిప్ అయిన స్పీకర్ తమ్మినేని !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తప్పులో కాలేశారు. టంగ్ స్లిప్ కావడంతో సీఎం జగన్‌కు బదులు మాజీ సీఎం చంద్రబాబు డైనమిక్ లీడర్ అంటూ ప్రశంసలు కురిపించారు. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ కరోనా కట్టడికి సీఎం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించకుండా ఉండలేమని స్పీకర్ అభిప్రాయపడ్డారు. వాలంటీర్లు, సచివాలయాల కాన్సెప్ట్‌ల ద్వారా ప్రతి ఇంటికి ప్రభుత్వం చేపట్టే కోవిడ్ నివారణ చర్యలను తీసుకెళ్లే అద్భుతమైన యంత్రాంగాన్ని మనం ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఈ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్ముతున్నారని, చంద్రబాబు నాయుడి డైనమిక్ నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యానించడంతో అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు. వెంటనే తప్పు తెలుసుకున్న స్పీకర్ తమ్మినేని మన జగన్మోహన్‌రెడ్డి గారు అంటూ మాటను సవరించుకున్నారు. కాగా ప్రజలందరూ తప్పకుండా కోవిడ్ నివారణ చర్యలను పాటించాలని స్పీకర్ విజ్ఞప్తి చేశారు.


Post a Comment

0Comments

Post a Comment (0)