ఉత్తరప్రదేశ్ లో ఫిబ్రవరి 15 వరకు స్కూళ్లు బంద్‌

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉద్దృతి నేపథ్యంలో పాఠశాలలను ఫిబ్రవరి 15 వ తేదీ వరకు మూసివేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు హోం అదనపు ప్రధాన కార్యదర్శి అవనీష్ అవస్తీ ఉత్తర్వులు జారీ చేశారు. ఆన్‌క్లాసులు మాత్రమే నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో ఇప్పటికే పాఠశాలలను మూసివేశారు. జనవరి 30 వరకు పాఠశాలలను మూసివేయాలని గతంలో ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వగా.. ఇంకా కరోనా ఉద్దృతి తగ్గని నేపథ్యంలో ఫిబ్రవరి 15 వరకు సెలవులను పొడిగించారు. సెకండ్ బోర్డు పరీక్షల దృష్ట్యా ఆన్‌లైన్ క్లాసులు యధావిధిగా కొనసాగుతాయని హోం అదనపు ప్రధాన కార్యదర్శి అవనీష్ అవస్తీ తెలిపారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో బుధవారం 10,937 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 80,342 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఒక్క లక్నోలో బుధవారం ఒక్కరోజే 2096 కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం.

Post a Comment

0Comments

Post a Comment (0)